టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు ప్రారంభం

Jun 8,2024 23:09
స్థానిక శ్రీ ప్రకాష్‌ సినర్జీ

ప్రజాశక్తి – పెద్దాపురం

స్థానిక శ్రీ ప్రకాష్‌ సినర్జీ స్కూల్‌లోని శ్రీ ప్రకాష్‌ సినర్జీ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీలో శనివారం ఉత్సాహపూరిత వాతా వరణంలో రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ టేబుల్‌ టెన్నిస్‌ అసోసి యేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డెవలప్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ శ్రీ ప్రకాష్‌ సినర్జీ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీ డైరెక్టర్‌ సిహెచ్‌.విజరు ప్రకాష్‌ మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో వివిధ జిల్లాల నుంచి 540 మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. అండర్‌ 11, అండర్‌ 13, అండర్‌ 15, అండర్‌ 17, అండర్‌ 19 విభాగాల్లో డబుల్స్‌, మిక్స్డ్‌ డబుల్స్‌లో బాలురు, బాలికలకు ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అండర్‌ 11, అండర్‌ 13, అండర్‌ 15 విభాగాల్లో బాలురు, బాలికలు క్వాలిఫై అయి ఫైనల్స్‌కు జరగబోయే మెయిన్‌ డ్రాకు ఎంపికయ్యారని వివరించారు.

➡️