తాళ్ళరేవు సొసైటీ అధ్యక్షులు జనార్దనరావు రాజీనామా

Jun 8,2024 15:40 #Kakinada

ప్రజాశక్తి – తాళ్లరేవు: మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ప్రస్తుత తాళ్ళరేవు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార పరపతి సంఘం (పిఎసిఎస్)అధ్యక్షులు దున్న జనార్ధన రావు సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.2013లో సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైన జనార్ధన రావు 2019 వరకు అధ్యక్షులుగా కొనసాగారు. అనంతరం ప్రభుత్వం త్రీ మెన్ కమిటీనీ ఏర్పాటు చేసి జనార్దనరావును పర్సన్ ఇన్చార్జిగా నియమించారు. జూలై 30వ తేదీ 2024 తో తన పర్సన్ ఇన్చార్జ్ పదవీకాలం ముగియనుండగా ప్రభుత్వం నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శనివారం తాళ్లరేవు సొసైటీలో విలేకరులతో జనార్ధన రావు మాట్లాడారు. తన పదవీ కాలానికి ముందు సి.గ్రేడ్ గా ఉన్న గా సొసైటీని ఏ గ్రేడ్ సొసైటీగా మార్చినట్లు తెలిపారు. వ్యాపారంలో రూ.3.50కోట్లు ఉన్న సొసైటీని రూ.12.50 కోట్ల టర్నోవర్ వరకు తీసుకొచ్చినట్లు తెలిపారు. జిల్లాలోనే లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఉత్తమ వ్యాపారం చేసిన సొసైటీగా తాళ్ళరేవు సొసైటీ కి అవార్డు దక్కిందన్నారు. అంతేకాకుండా సుమారు రూ.28 లక్షలు ఆదాయపు పన్ను చెల్లించిన సొసైటీగా ను పేరుగాంచిందని అన్నారు. అయితే ఆదాయ పన్ను ద్వారా చెల్లించిన రూ.28 లక్షలు సొసైటీలకు ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపులో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తిరిగి ఆయా సొసైటీలకు చెల్లించాలనే నిబంధనలో భాగంగా న్యాయబద్ధంగా రూ. 28 లక్షలు సొసైటీకి తిరిగి రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తనతో పాటు కమిటీలో భాగమైన కట్ట మార్కండేయులు, కానూరి సత్యనారాయణ ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పదవీకాలంలో ఉత్తమ సేవలు అందించినందుకు దున్న జనార్దన రావు, ఇతర సభ్యులను పలువురు దు, పూలమాలలతో పూలమాలలతో అలంకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ పెన్మత్స లక్ష్మీనారాయణ, పలువురు రైతులు, సొసైటీ సిబ్బంది మోహన్, సంపత్, పలువురు అభిమానులు పాల్గొన్నారు.

➡️