ప్రజాశక్తి – గొల్లప్రోలు
మండలంలోని చెందుర్తి గ్రామంలో టిడిపి, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బుధవారం చెందుర్తిలోని ఆర్‌ఒ ప్లాంట్ ప్రారంభోత్స వానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హజర య్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంఎల్‌ఎ, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎస్‌విఎస్ ఎన్.వర్మను ఆహ్వానించకపోవడంతో టిడిపి కార్యకర్తలు ఆయనను నిలదీశారు. ఈ సందర్భంగా జనసేన, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకుంది. అరుపులు, కేకల మధ్య ఆర్‌ఒ ప్లాంట్‌ను మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించి కార్యక్రమం ముగియకుండానే మధ్యలోనే వెళ్లిపోయారు. అనంతరం ఇరుపక్షాల నాయకులు కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు.