ప్రజాశక్తి – ఏలేశ్వరం
సమాజ అభివృద్ధికి అవసరమైన మానవ వనరులను అందించేందుకు ఉపా ధ్యాయ వృత్తి దోహదం చేస్తుందని ఎంఎల్‌ఎ వరుపుల సత్యప్రభ అన్నారు. ఆదివారం యుటిఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా, మండల ఉత్తమ ఉపాధ్యాయులను సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ వేలాదిమంది ఉత్తమ భావి భారత పౌరులను తీర్చిదిద్దే అవకాశం కేవలం ఉపాధ్యా యులకు మాత్ర మే ఉంటుందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యా యులుగా ఎంపికైన దేశెట్టి రామలక్ష్మి, జి.మురళీకృష్ణ, మండల ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతలు ఎం.భాద్య, సిహెచ్. స్వరాజ్యలక్ష్మి, కె.లింగేశ్వరి, కె.దేవదేవి, టి.శ్రీనివాస రావు, కె.వీర్రాజులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొల్లపల్లి బుజ్జి, వైస్ ఎంపిపిలు చిక్కాల రాజ్యలక్ష్మి, సాదే లోవరాజు, మాజీ .జడ్‌పిటిసి జ్యోతుల పెదబాబు, బొద్దిరెడ్డి గోపి, ఎంపిడిఒ జె.శ్రీనివాస్, ఎంఇఒలు బి.అబ్బాయి, కె.వరలక్ష్మి, యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.