రాష్ట్ర స్థాయి పోటీకి జట్టు ఎంపిక

Jun 9,2024 23:25
రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఉమ్మడి

ప్రజాశక్తి – పిఠాపురం

రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్య దర్శులు గోపాలకృష్ణ, పి. లక్ష్మణరావు తెలిపారు. ఆది వారం స్థానిక ఆర్‌ఆర్‌బి హెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలను పిఠాపురం మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ కొత్తపల్లి పద్మ, కౌన్సిలర్‌ పి.నాగేశ్వరరావులు ప్రారంభించారు. ఈ పోటీలకు చింతూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, పిఠాపురం, కిర్లంపూడి తదితర ప్రాంతాల నుంచి 150 మంది ఆర్చర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 30 మందిని ఎంపిక చేసినట్టు వారు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 22 నుంచి 24 వరకు విజయవాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున పాల్గొంటారన్నారు. పోటీలు అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ వి.కేశవరావు, పిఠాపురం మున్సిపల్‌ కౌన్సిలర్‌ అల్లవరపు నగేష్‌, జనసేన నాయకులు మార్నీడి రంగబాబు, ఇమ్మిడిశెట్టి నాగేంద్ర కుమార్‌, వీరబాబు, టిడిపి నాయకులు వి.రామరాజు బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణీతలుగా కె.చిన్నబ్బాయి, జి.శివప్రసాద్‌, పి.కృష్ణ వ్యవహరించారు.

➡️