ప్రజాశక్తి – ఏలేశ్వరం
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల 16వ వార్షికోత్సవం ప్రిన్సిపల్ డాక్టర్ డి.సునీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జెడి డాక్టర్ ఎస్.శోభారాణి, విజయ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ ఎస్.విజయబాబు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారిలోని సృజనాత్మకత పెంపొందుతుందన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు, బెట్టింగ్ యాప్‌లకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.వెంకటేశ్వర్‌రావు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రగడ ప్రయాగమూర్తి, అధ్యాపకులు వి. రామారావు, కె.సురేష్, ఎస్‌కె.మదీనా, ఎం.వీర భద్రరావు, డాక్టర్ బంగారు రాజు, పుష్ప, కుమారి, మేరీ రోజలినా, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.