గణనీయంగా ఓటింగ్‌ శాతం పెరుగుదల: కలెక్టర్‌

May 14,2024 23:21
రాజ్యాంగం కల్పించిన ఓటు

ప్రజాశక్తి – కాకినాడ

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు కల్గిన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించు కోవా లని యంత్రాంగం చేపట్టిన అవ గాహన, చైతన్య కార్యక్రమాలు ఓటింగ్‌ శాతం పెరుగుదలకు దోహ దం చేశాయని కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. 2019లో జరిగిన సాధా రణ ఎన్నికలలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న ప్రస్తుత కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాలలో 78.52 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, ఇది 2024 ఎన్ని కలలో తుది గణాంకాలు సంకలనం పూర్తయ్యే సరికి దాదాపు 6 శాతం మేరకు పెరగనుందని ఆయన తెలిపారు. ప్రజా భాగస్వామ్యంతో జిల్లాలో విస్తృతంగా నిర్వహించిన స్వీప్‌ కార్యక్రమాలు ఇందుకు దోహదం చేశాయని, అర్హులైన వారం దరూ ఓటర్లుగా నమోదు కావడంతోపాటు, ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి బాధ్యతగా వినియో గించుకునేలా చైతన్య పరిచాయన్నారు. ఈ ఉద్య మంలో చురుకైన భూమిక వహించిన జెఎన్‌ టియు, రంగరాయ వైద్య కళాశాలల విద్యార్థులు, లాయర్లు, మత్సకార పెద్దలు, ఆటోడ్రైవర్లు, పోలీసులు, స్వచ్చంద సంస్థలను, ఆయన ప్రత్యేకంగా అభినందిం చారు. అలాగే ఓటు పవిత్రత, ప్రాధాన్యతలను చాటుతూ ప్రసిద్ధ యువ నేపధ్య గాయకుడు, యూత్‌ ఐకాన్‌ డాక్టర్‌ యశస్వీ కొండేపూడి సహకారంతో చిత్రీకరించి, వివిధ మాద్యమాల ద్వారా ప్రదర్శించిన ఓటే నీ ఆయుధం స్వీప్‌ వీడియో సాంగ్‌ను 57 వేలు పైబడి ప్రజలు తిలకించి, స్పందించారన్నారని తెలిపారు. స్వీప్‌ సదస్సులు, ర్యాలీలు, సందేశాత్మక గ్లో లైట్‌లు హోల్డింగ్స్‌, సెల్ఫీ పాయింట్లు వివిధ వర్గాల ప్రజల్లో ఓటు హక్కు ప్రాధాన్యతపై ఆలోచన, ఆచరణ జాగృతం చేసాయని అన్నారు. ఎన్నికలను పర్వదినంగా భావించి, ప్రజాస్వామ్యం పట్ల అచంచల విశ్వాసాన్ని చాటుతూ తమ ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఓటర్లు అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే పోలింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు, సిబ్బంది అందరినీకలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

➡️