పారిశుధ్య నిర్వాహణపై కలెక్టర్‌ ఆగ్రహం

Mar 18,2025 22:33
నిర్వాహణపై కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి

ప్రజాశక్తి – శంఖవరం

అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పారిశుధ్య నిర్వాహణపై కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రత్నగిరికి వచ్చిన ఆయనకు దేవస్థానం ఇఒ సుబ్బారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సత్యదేవుని దర్శించుకున్న అనంతరం టాయిలెట్లు, స్నానపు గదులు పరిశీలించారు. కొన్నిచోట్ల పారిశుధ్యం లోపించడాన్ని గమనించిన ఆయన అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాఉరు. ఇకపై ప్రతి మంగళవారం సిబ్బందితో స్వచ్ఛత దినోత్సవం నిర్వహించాలని ఇఒని ఆదేశించారు. అనంతరం పంపా రిజర్వాయర్‌ కాలువను పరిశీలించారు పంపాలోకి ఏలేరు రిజర్వాయర్‌ నుంచి నీటిని మళ్లించేందుకు అవసరమైన నివేదికను రూపొందించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, పోలవరం, పుష్కర కాలువల అధికారులు పాల్గొన్నారు

➡️