మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

Mar 8,2025 22:51
మంత్రి పి.నారాయణ పాల్గొన్నారు.

ప్రజాశక్తి – యంత్రాంగం

కాకినాడ ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ వ్యాపార వేత్తగా, పారిశ్రామిక వేత్తగా ఎదగాలన్నదే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి పి.నారాయణ అన్నారు. శనివారం స్థానిక రాజాట్యాంక్‌ ప్రాంగణంలోని ఫేబ్‌ కన్వెన్షన్‌ హాలులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, డిఆర్‌డిఎ, మెప్మా శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ జిల్లా స్థాయి వేడుకను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ సగిలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు, ఎంపి తంగెళ్ల ఉదరుశ్రీనివాస్‌, ఎంఎల్‌సిలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ఎంఎల్‌ఎలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, నిమ్మకాయల చిన్నరాజప్ప, జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ తోట సుధీర్‌, కుడా ఛైర్మన్‌ తుమ్మల రామస్వామి, మాజీ మేయర్‌ సుంకర పావని, ఎస్‌పి జి.బిందుమాధవ్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ భావన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సృష్టికి మూలం స్త్రీ అని, అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు అనేది మనందరి నినాదం కావాలన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలు స్వతంత్రంగా తమ కాళ్లపై తాము నిలబడేలా అన్నింటా ప్రాధాన్యం కల్పిస్తోందన్నారు. అనంతరం మహిళా సంఘాలకు రుణాల చెక్కలను పంపిణీ చేశారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్‌పి మనీష్‌ పాటిల్‌ దేవరాజు, ట్రైనీ ఐపిఎస్‌ అధికారి సుస్మిత, డిఆర్‌ఒ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. యు.కొత్తపల్లి డ్వాక్రా సంఘాల అభివృద్ధికి కృషి చేసిన పలువురు విఒలు డిఆర్‌డిఎ పీడీ శ్రీనివాసరావు చేతుల మీదుగా పశంసా పత్రం, మెమొంటోలు అందుకున్నారని ఎపిఎం తౌడు తెలిపారు. మండలానికి చెందిన విఒలు సాక నిర్మల, పి.అనూష, పంపుతమ్మ, పి.గౌరీ, క్లస్టర్‌ కోఆర్డినేటర్‌ అజ్జమ్మ సామర్లకోటలో జరిగిన మహిళా దినోత్సవంలో అవార్డులను అందుకున్నారు. గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులో ఆదర్ష్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ బుర్రా అనురాధ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపిఎస్‌ అధికారి సుస్మితా రామనాథన్‌ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్‌ జె.రాజేశ్వరి, గైనకాలజిస్ట్‌ ఆర్‌.సరస్వతి, అడ్వకేట్‌ ఎ.దేవి, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మర్రెడ్డి శ్రీనివాస్‌ ,టిడిపి పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, జెవివి సమత కన్వీనర్‌ సిహెచ్‌ఇఆర్‌.మంగతాయారు పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ కొవ్వూరు సెక్టార్‌ అంగన్‌వాడీల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం తూరంగి అల్లూరి సీతారామరాజు కాలనీలో జరిగింది. సిహెచ్‌.విజయ అధ్యక్షతన జరిగిన సభలో హెల్త్‌ అడ్వైజర్‌ రాబర్ట్‌ రవిచంద్ర, సిడిపిఒ వై.లక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్తిపాడు స్థానిక బార్‌ అసోసియేషన్‌, సదా మీ సేవ సంస్థ, అఖిల్‌ కాలేజీల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌.విజయ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ లత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. కరప వేలంగి సర్పంచ్‌ సవిలే నీలిమ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యారంగంలో సేవలందిస్తున్న జి.సుజాత, గిడితూరి వీరవెంకటవిజయలక్ష్మి, ఇండియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు తప్పెట్ల పృథ్వీరాజ్‌ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పెంకే శ్రీలక్ష్మి, ట్రస్ట్‌ ఆఫ్‌ బొండా ఛైర్మన్‌ డాక్టర్‌ బొండా వెంకన్నారావు, సామాజిక వేత్త సవిలే రాజేష్‌, పంచాయతీ కార్యదర్శి సంతోష్‌ పాల్గొన్నారు. ఏలేశ్వరం స్థానిక ప్రభుత్వాసుపత్రి మహిళా వైద్యులను, వైద్య సిబ్బందిని ఘనంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ కో ఛైర్మన్లు జొన్నాడ వీరబాబు, వాగు రాజేష్‌ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి, యండగుండి నాగబాబు, కోణాల వెంకటరమణ, నాయకులు పాల్గొన్నారు. పెద్దాపురం స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో యుటిఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ సభకు యుటిఎఫ్‌ ఉమెన్‌ అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ అరుణశ్రీ అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా డివైఇఒ ఈరంకి ప్రభాకరశర్మ, ఎస్‌ఐ వి.మౌనిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవితలు పోటీలు, ఆటల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. స్థానిక మట్టే ఆదినారాయణ, నాగరత్నమ్మ ఆర్యవైశ్య సేవా సంఘ భవనంలో మట్టే సూర్య కమల, మట్టే విద్యుల్లత అధ్యక్షతన జరిగిన మహిళా దినోత్సవ సభలో వివిధ రంగాలలో సేవలందించిన డాక్టర్‌ స్రవంతి, డాక్టర్‌ జగదాంబ, ఎంపిడిఒ డి.శ్రీలలిత, పెద్దాపురం చిల్డ్రన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు కూనిరెడ్డి అరుణ లను ఘనంగా సన్మానించారు. తుని స్థానికంగా నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ యనమల దివ్య పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్‌, కుసుమతి శోభారాణి, చింతమనేడు అబ్బాయి, మోత్కూరు వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. గండేపల్లి సురంపాలెం ఆదిత్య విద్యాప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బందిని జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. యూనివర్సిటీ డిప్యూటీ ప్రో ఛాన్సలర్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి, వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఎంబి.శ్రీనివాస్‌, ప్రో వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఎస్‌.రమాశ్రీ, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి. సురేష్‌ వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్‌, విద్యార్థులు పాల్గొన్నారు. సామర్లకోట మెప్మా ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ అరుణ, మున్సిపల్‌ కమిషనర్‌ ఎ. శ్రీవిద్య జనసేన నాయకురాలు పెంకె వెంకటలక్షి పాల్గొని మాట్లాడారు. అనంతరం పలువురు మహిళా ఉద్యోగులను, ప్రజా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ గోకిన సునేత్రా దేవి, మహిళా కౌన్సిలర్లు గొర్రెల విజయలక్ష్మి, కాళ్ళ శ్యామల, పాళిక కుసుమ చంటిబాబు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఐసిడిఎస్‌ పరిధిలో అంగన్‌వాడీలకు నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన అంగన్‌వాడీలు ఎంవి.శ్రీలక్ష్మి, వి.వెంకటలక్ష్మి, టి.నాగ మణి, కె.అనిత, అమలావతి, నాగలక్ష్మి, భవాని మంత్రి నారా యణ చేతుల మీదుగా జ్ఞాపికలు అందుకున్నారు.

➡️