చేనేతను ప్రభుత్వం ఆదుకోవాలి

Mar 9,2025 22:38
అధ్యక్షులు ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోరారు.

ప్రజాశక్తి – పెద్దాపురం

రాష్ట్ర ప్రభుత్వం చేనేతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోరారు. స్థానిక ముప్పన రామారావు వీవర్స్‌ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేనేత సంక్షోభం వల్ల చేనేత పరిశ్రమ రోజురోజుకు శిథిలమవుతుందన్నారు. దీంతో చేనేత కార్మికులకు ఉపాధి లేక అల్లాడుతున్నారన్నారు. చేనేత పరిశ్రమ రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ సమావేశాలలో చేనేతల సమస్యలు, వారి కష్టాల గురించి ప్రభుత్వానికి తెలియజేసిన ఎంఎల్‌ఎలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నడికుడి ఈశ్వరరావు, అయితాబత్తుల ఆనందరావు, కందికుంట ప్రసాద్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో అమరావతి రాజధానిలో ప్రభుత్వ సహకారంతో దేవాంగ భవనం నిర్మించాలని, దేవాంగులను ఆర్థికంగా ఆదుకోవాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి శివశంకరయ్య, కోశాధికారి కొండపల్లి పరమేశ్వరరావు, నాయకులు బండారు ఆనందప్రసాద్‌, ముప్పన వీర్రాజు, మచ్చా నిరంజన్‌, భూసం వీరభద్రయ్య, ఉప్పు సత్యనారాయణ, పిచ్చుక శ్యామ్‌, పులి రామచంద్ర, మాడా రాము, ఎక్కల ఆంజనేయ ప్రసాద్‌, కారుపర్తి రత్న, జాన శంకర్రావు, చింతా వీరభద్రరావు, ఎర్రా వీరభద్రరావు, బళ్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

➡️