అత్యవసర సమస్యల పరిష్కారమే తక్షణ కర్తవ్యం

Oct 7,2024 23:48
ప్రభుత్వ లక్ష్యమని

ప్రజాశక్తి – కాజులూరు

అత్యవసర సమస్యల తక్షణ పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. సోమవారం మండలంలోని కాజులూరు, తిప్పరాజుపాలెం గ్రామాల్లో ‘మన గ్రామం – మన సుభాష్‌’ కార్య క్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. కేవలం దాచుకో దోచుకో అన్న రీతిలోనే ప్రభుత్వం పాలన సాగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివద్ధి కార్యక్రమాలు ప్రారం భించిందన్నారు. గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన అనేక సమస్యలను గుర్తించి వాటిని గ్రామ కమిటీల ద్వారా అత్యవసర పనులను చేపట్టేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నప్పటికీ గ్రామ కమిటీలు, జనసేన ఇన్‌ఛార్జ్‌ పోలిశెట్టి చంద్రశేఖర్‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి యాళ్ళ కష్ణారావు, సర్పంచ్‌ ఆంజనేయవరప్రసాద్‌, తహశీల్దార్‌ శివకుమార్‌, ఎంపిడిఒ జె.రాంబాబు, స్థానిక నాయకులు అన్యం శ్రీరామచంద్రమూర్తి, పంచాయతీ కార్యదర్శి ఈశ్వరి, టిడిపి మండల అధ్యక్షుడు పేపకాయలు బాబ్జి, వనుము వీరబ్రహ్మం పాల్గొన్నారు.

➡️