ఆసుపత్రి తీరుపై ఇన్‌ఛార్జ్‌ డిసిహెచ్‌ఎస్‌ ఆగ్రహం

Jun 8,2024 23:08
పిఠాపురం ప్రభుత్వా

ప్రజాశక్తి – పిఠాపురం

పిఠాపురం ప్రభుత్వాసుపత్రి నిర్వహణ తీరుపై ఇన్‌ఛార్జ్‌ డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ స్వప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలో ట్యూబేక్టమి ఆపరేషన్‌ చేయించుకున్న అనంతరం పలు వురు ఇన్ఫెక్షన్‌కు గురౌతున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్‌ ఆదేశాల మేరకు శనివారం ఇన్‌ఛార్జ్‌ డిసి హెచ్‌ఎస్‌ స్వప్న ఆసుపత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, రోగుల పట్ల వైద్యుల ప్రవర్తన తీరును నేరుగా ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌పేషట్లుగా ఉన్న వార్డులో సరియైన గాలి, వెలుతురు లేకపోవడడం, పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉండడం, ఫ్యాన్లు తిరగక పోవడంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుజాతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వైద్యులు, ముఖ్య సిబ్బందితో కూర్చుని విలేకరుల సమక్షంలో ట్యూబేక్టమి ఆపరేషన్లు చేయించుకున్న రోగులు పడిన ఇబ్బందులు, ఇన్ఫెక్షన్‌ ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. వైద్యుల, సిబ్బంది పనితీరు సక్రమంగా లేదన్నారు. ఇప్పటికైనా పనితీరు మెరుగుపరుచుకోకుంటే చర్యలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుజాత తాము వైద్యం సక్రమంగా చేస్తున్నా మని చెప్పబోతుంటే పనితీరు మెరుగుపరచు కోవాలని ఆదేశించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని వారాలుగా ఆసుపత్రి నిర్వహణపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని, కనీసం ఫ్యాన్లు కూడా లేవన్నారు. గతంలో ఇదే ఆస్పత్రిలో 180 వరకు డెలి వరీలు చేసేవారని ప్రస్తుతం అవి వంద మాత్రమే జరుగుతున్నాయన్నారు. సమస్య లను పరిష్కరిం చడంలో నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తుందన్నారు. విచారణ సదర్భంగా బహుజన సమాజ్‌వాది పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.లోవరాజు రోగులు పడుతున్న ఇబ్బందులు, ఆసుపత్రిలో నెలకున్న సమస్యలను డిసిహెచ్‌ఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు.

➡️