ఎగసిపడుతున్న అలలు

May 25,2024 11:52 #Kakinada

భయభ్రాంతులకు గురవుతున్న వాహనదారులు
ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ లో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి సముద్రపు అలలు తీవ్ర స్థాయిలో ఉండడంతో బీచ్ రోడ్డుకు గోడగా వేసిన రక్షణ రాళ్లు రోడ్డుపైకి చేరుకోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు గురవుతున్నారు. సుబ్బంపేట నుండి ఎస్పీజీఎల్ శివారు వరకు అలలు బీచ్ రోడ్డు పైకి చేరుతున్నాయి. ఎస్పీజీఎల్ సమీపం వద్ద ఉన్న వంతెన పైనుండి కెరటాలు వెళ్లడంతో అటుగా వెళ్లే వాహనదారులు బై బ్రాంతులకు గురవుతున్నారు. తీవ్ర అల్పపీడనంగా మారుతుంది అన్న అధికారుల సమాచారంతో తీర ప్రాంత గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

➡️