క్లాప్‌ డ్రైవర్లకు కార్మిక సంఘాల మద్దతు

Nov 27,2024 22:35
కార్మిక సంఘాలు మద్దతు తెలిపారు.

ప్రజాశక్తి – కాకినాడ

మూడు నెలల బకాయి వేతనాల కోసం ఉద్యమం చేపట్టిన క్లాప్‌ డ్రైవర్లకు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలిపారు. బుధవారం నాటికి క్లాప్‌ వాహన డ్రైవర్‌లు చేపట్టిన ఆందోళన 34 రోజులుకి చేరుకుంది. మున్సిపల్‌ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరసన శిబిరాన్ని ఎఐటియుసి, టిఎన్‌టియు పిఎస్‌ నారాయణ, గదుల సాయిబాబా పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లాప్‌ వాహన డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాయ న్నారు. 34 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తన్నట్టు వ్యవహరిం చడం సరి కాదన్నారు. అనంతరం మున్సిపల్‌ అధికారులను కలిసి తక్షణమే జీతాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకటి రెండు రోజుల్లో జీతాలు పడతాయని అధికారులు చెప్పారని, దానిని నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, సిఐటియు నగర కన్వీనర్‌ మలకా వెంకట రమణ, క్లాప్‌ వాహన డ్రైవర్‌ యూనియన్‌ నాయకులు సంతోష్‌, ఇస్మాయిల్‌, దుర్గాప్రసాద్‌, భైరవ స్వామి, రాజు, శివ శ్రీను, శివ, వెంకటేష్‌, దుర్గబాబు పాల్గొన్నారు.

➡️