మహాత్మా గాంధీకి ఘన నివాళి

Oct 2,2024 22:50
మహాత్మా గాంధీకి ఘన నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం జిల్లావ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజాశక్తి-యంత్రాంగంకాకినాడ సత్యం, అహింస అస్త్రాలుగా చేసుకుని దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ అని జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ సగిలి పేర్కొన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహానికి జెసి రాహుల్‌ మీనా, ట్రైనీ కలెక్టర్‌ హెచ్‌ఎస్‌.భావన, డిఆర్‌ఒ డాక్టర్‌ తిప్పేనాయక్‌తో కలిసి ఆయన నూలు దండ, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు వారు పూలమాలువేసి, పుష్పాంజలి ఘటించారు. కాకినాడ రూరల్‌ మండలం, వలసపాకల, సుందరయ్య కాలనీలో పేదలు, కార్మికుల పిల్లలకు ఉచిత ట్యూషన్‌ సెంటర్‌ను సిఐటియు మండల కన్వీనర్‌ టి.రాజా అధ్యక్షతన ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. సుందరయ్య కాలనీ పేదలు, కార్మికుల పిల్లలకు ఉచితంగా ట్యూషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఈ అవకాశాన్ని కాలనీవాసులందరూ ఉపయోగించుకుని మంచి స్థాయికి ఎదగాలి అన్నారు. అందరూ చదువుకోవడం ద్వారానే ఈ సమాజాన్ని మార్చగలము అన్నారు. కార్మికుల పిల్లలు చదువుకోవడం కోసం సిఐటియు కార్యాలయాన్ని ట్యూషన్‌ సెంటర్‌ గా మార్చడం మంచి ఆలోచన అన్నారు. చేయూత సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ మొండి రవికుమార్‌ మాట్లాడుతూ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ 14 రకాల సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. అనంతరం పిల్లలందరికీ నోట్‌ బుక్స్‌, పెన్‌ లు పంపిణీ చేశౄరు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్‌ నాయకులు తిరుమలశెట్టి నాగేశ్వర రావు, ఏపీఎస్పీ స్కూల్‌ హెచ్‌ఎం పి.మధు కుమార్‌, ట్యూషన్‌ సెంటర్‌ టీచర్‌ లక్ష్మి, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు చింతా నారాయణ మూర్తి, సురభి శారద, కందుకూరి పాల్‌ రాజు, పిల్లి గోవింద రాజులు, పవన్‌ కళ్యాణ్‌, సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, సిహెచ్‌ శ్రీహరి, డి సత్యనారాయణ, వి. సత్తిబాబు, సురేష్‌, నూకరాజు, శ్రీను, రాంబాబు, బలరామ్‌, సంగీతరావు, పాల్గొన్నారు.రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు, అడబాల రత్న ప్రసాద్‌, బుద్ధరాజు సత్యనారాయణ రాజు, జి.కృష్ణమోహన్‌, ఎస్‌.శ్రీనగేష్‌ పాల్గొన్నారు.రమణయ్యపేట వైద్యనగర్‌లో మాజీ మంత్రి కన్నబాబు నివాసం వద్ద మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కురసాల సత్యనారాయణ, ఎంపిపి బందిలి విరీషా, నేమాం సర్పంచ్‌ రామదేవు సూర్యప్రకాశ్‌, మాకినీడి శేషుకుమారి, నల్లబిల్లి సుజాత, ఎం.కష్ణంరాజు, రావూరి వెంకటేశ్వరరావు, కడియాల చినబాబు, చిల్లి దేవరాజు, పెనుమాల ధర్మారావు, కర్రి చక్రధర్‌, నాగబాబు, కొండలరావు, జాన్‌ ప్రభాకర్‌, వాసిరెడ్డి సూరిబాబు, నక్కా సత్తిబాబు, నల్ల రాణి శ్రీను, మేడిశెట్టి లక్ష్మీ, భువనేశ్వరి, కొప్పిశెట్టి భవాని, తదితరులు పాల్గొన్నారు.ప్రత్తిపాడు మార్కెట్‌ సెంటర్‌లో గాంధీజీ విగ్రహానికి ఎంఎల్‌ఎ వరుపుల సత్య ప్రభ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ యాళ్ళ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.తాళ్లరేవు ఎంపీ గంటి హరీష్‌ మాధుర్‌, ఎంఎల్‌ఎ దాట్ల సుబ్బరాజు డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో గాంధీ జయంతి సందర్భంగా ప్రిన్సిపల్‌ పి.పద్మావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ పద్మావతి గురుకుల పాఠశాలలో సమస్యలను వారి దృష్టికి తీసుకు వచ్చారు. పాఠశాలకు సరిపడినంత సిబ్బంది, సౌకర్యాలు లేవని చిన్నపాటి వర్షానికి ప్రాంగణం జలమయం అవుతుందని డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. వంటశాలలో అన్నం వార్చిన గంజి పోవడానికి దారి లేదని దీనివల్ల దుర్గంధం వెదజల్లుతుందని తెలిపారు. పాఠశాల ప్రవేశం నుంచి రహదారి సౌకర్యం లేక విద్యార్థులు నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రహరీ గోడ కూలిపోవడం వల్ల విద్యార్థులకు రక్షణ కరువైందని తెలిపారు. గురుకుల పాఠశాల సంక్షేమానికి నిధులు కేటాయించాలని కోరారు. అన్ని సౌకర్యాలూ మెరుగు పరుస్తామని ఎంపీ హరీష్‌, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాయుడు సునీత, మాజీ ఎంపిపి మందాల గంగ సూర్యనారాయణ, ఎఎంసి చైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ, టిడిపి నాయకులు కట్టా త్రిమూర్తులు, వాడ్రేవు వీరబాబు, పొన్నమండ రామలక్ష్మి, నరాల రాంబాబు, ధూళిపూడి బాబీ, నడింపల్లి వినోద్‌, కొత్తూరు కాశి, ఉంగరాల వెంకటేశ్వరరావు, గుత్తుల సాయి, టి.లక్ష్మణరావు, పిల్లి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. గండేపల్లి మండల కేంద్రంలో శివాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి గండేపల్లి ఎస్‌ఐ శివనాగు, వెలమాటి కాశి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో, ఎంపిడిఒ బిఎస్‌కె.రామన్‌ ఆధ్వర్యంలో ఎంపిపి చలగళ్ల దొరబాబు గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మురారి గ్రామంలో సచివాలయంలో ఉప సర్పంచ్‌ జాస్తి వసంత్‌ నివాళులర్పించారు. ఇప్పర్ల బాబీ, చాగంటి సత్యనారాయణ, కంటిపూడి రామయ్య ఆళ్ల సత్తిబాబు, వెంపాటి సతీష్‌, మాగంటి బాబీ, పసుమర్తి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.పిఠాపురం సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో స్థానిక ఉప్పాడ బస్టాండ్‌ సెంటర్‌లో గాంధీ విగ్రహానికి నాయ కులు పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. ఈ సంద ర్భంగా నాయ కులు కె.చిన్న, కోనేటి రాజు, మణి, భాస్కర్‌, బాబ్జి మాట్లాడారు. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి మతోన్మాద శక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరజీవి గాంధీ అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడమే గాక లౌకిక దేశంగా మెలగాలని, ప్రజలే పాలకులును ఎన్నుకోవాలని, ప్రజల అభ్యున్నతకి కులమతాలు భేదాలు లేని గ్రామ స్వరాజ్యం రావాలని కళలుగన్న వ్యక్తి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాలు, సిపిఎం నాయకులు జి.వీరబాబు, విశ్వనాథం, నాగేశ్వరరావు, రాజుబాబు, శ్రీను, స్టాలిన్‌, గోవిందాచారి సూర్యనారాయణ, పోశయ్య, రవి, రాజేష్‌, నాగు, మణికంఠ, ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.సామర్లకోట పలు జయంతి కార్యక్రమాల్లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహాలకు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ డి.శ్రీ లలిత, ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు పాల్గొన్నారు. గణపతి నగరం వాటర్‌ ట్యాంకర్‌ వద్ద, మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీవిద్య ఆధ్వర్యంలో చైర్‌పర్సన్‌ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, బిజెపి నాయకులు నివాళులర్పించారు. స్టేషన్‌ సెంటర్లోని గాంధీ విగ్రహానికి రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ ఎం.రమేష్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిబిదేవంలో పంచాయతీ సర్పంచ్‌ నీలపాల సత్యనారాయణ, ఎంపిటిసి మలకల సూరిబాబు, హుస్సేన్‌పురంలో టిడిపి గ్రామ అధ్యక్షుడు చల్ల బుజ్జి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో డాక్టర్‌ గోరకపూడి చిన్నయ్య దొర, విత్తనాల వెంకటరమణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు ఊబా జాన్‌ మోజెస్‌, గోకిన సునేత్ర దేవి, కౌన్సిలర్లు పాగా సురేష్‌ కుమార్‌, పిట్టా సత్యనారాయణ, నేతల హరిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్‌, బలుసు వాసు, రవిచంద్ర ప్రసాద్‌, వల్లూరి దొరబాబు, అందుగుల జార్జి చక్రవర్తి, జనసేన నాయకులు సరోజ వాసు, మంచెం సాయి, పిట్టా జానకి రామారావు, పెంకె వెంకటలక్ష్మి, సాయి, గణేష్‌, పాల్గొన్నారు.కరప మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి శ్రీలక్ష్మి సత్తిబాబు, జెడ్‌పిటిసి యాళ్ల సుబ్బారావు, ఎంపిడిఒ అప్పారావు నివాళులర్పించారు. పెద్దాపురం పట్టణం, మండల పరిధిలోని గ్రామాల్లో బుధవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ పార్కులో గాంధీ విగ్రహానికి చైర్పర్సన్‌ బొడ్డు తులసి మంగతాయారు, వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయి ప్రసాద్‌, కమిషనర్‌ కెవి.పద్మావతి, ఆర్‌డిఒ కార్యాలయంలో ఆర్‌డిఒ శ్రీరమణి, గుడివాడ, కాండ్రకోట, పులిమేరులో ఆయా ప్రాంతాల వారు, పెద్దాపురం చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బుద్ధా శ్రీనివాస్‌, అరుణ్‌ కుమార్‌, గడిగట్ల సత్తిబాబు, డి.కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

➡️