ప్రజాశక్తి – యంత్రాంగం
పిఠాపురం గుంతలు రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక డ్రైవర్స్ కాలనీ వద్ద పిఠాపురం – కొండెవరం రోడ్డు మరమ్మతు పనులకు కలెక్టర్ షాన్‌మోహన్ సగిలి, మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎస్‌ఎన్.వర్మ, జనసేన నియోజ కవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీనివాసు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారు లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను గుంతల రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. తొలి దశలో జిల్లాకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. పిఠాపురం నియోజక వర్గానికి సంబంధించి రూ.2.60 కోట్లతో ఆర్ అండ్ బి రహదారుల మరమ్మతులు చేపట్టడం జరుగు తుందన్నారు. జిల్లాలో ప్రారంభించిన ప్రతి పని సకా లంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ ఎస్.మల్లి బాబు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకరావు, ఆర్ అండ్ బి ఎస్‌ఇ జి.కాంతు, ఇతర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పెద్దాపురం పెద్దాపురం – జగ్గంపేట రహదారిలోని పాండవుల మెట్ట ఫైర్ స్టేషన్ వద్ద ఎంఎల్‌ఎ నిమ్మకాయల చిన్న రాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భం గా చినరాజప్ప మాట్లాడుతూ గుంతల పూడ్చివేతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తాళ్లరేవు తాళ్లరేవు మెయిన్ రోడ్డు మరమ్మతు పనులకు ఎంఎల్‌ఎ దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా రూ.3.20 కోట్లతో రహదారులకు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాయుడు సునీత, ఎఎంసి ఛైర్మన్ కుడుపూడి శివన్నారాయణ, మాజీ ఎంఎల్‌ఎ చెల్లి వివేకానంద, ఆర్ అండ్ బి ఎఇ లక్ష్మీప్రసన్న, నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, పాల్గొన్నారు. సామర్లకోట పట్టణంలోని కెనాల్ రోడ్డు మరమ్మతు పనులకు ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామితో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, రాజా సూరిబాబురాజు, పాలకుర్తి శ్రీనుబాబు, వల్లూరి దొరబాబు పాల్గొన్నారు.