ప్రజాశక్తి – కాజులూరు
వైసిపి పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కన్పించలేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమా వేశం ఎంపిపి మాత భారతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల వారీగా ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధిపై చర్చించారు. ఈ సమా వేశంలో మంత్రి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం నిధులున్నా గ్రామాల అభివృద్ధికి కృషి చేయలే దన్నారు. సంక్షేమం పేరు చెప్పి కోట్లాది రూపా యలను దోచుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. మండలంలోని గ్రామాలకు చెందిన లింకు రోడ్లను రూ.3 కోట్లతో నిర్మిం చేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అక్టోబర్ 4 నుంచి గ్రామాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యచరణను రూపొందించి అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ నాగేశ్వరశర్మ, తహశీల్దార్ శివకుమా ర్‌లతో పాటు ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.