ప్రజాశక్తి – కాకినాడ, నల్లజర్ల
డిసెంబర్ 5న జరుగనున్న తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎంఎల్‌సి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతా ఓటును తనకు వేసి గెలిపించాలని పిడిఎఫ్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి విజ్ఞపి చేశారు. గురువారం స్థానిక యుటిఎఫ్ హోమ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను శాసనమండలికి పంపిస్తే ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల సమస్యల సాధనకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పాటుపడతానని, ప్రజాసం ఘాల ఉద్యమాల వాణిని మండలిలో వినిపిస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చరిత్రలో పిడిఎఫ్ ఎంఎల్‌సిల వారసుడిగా నిజాయితీగా, అభ్యుదయ విలువలకు కట్టుబడి, చిత్తశుద్ధి గా ప్రజాపక్షం వహిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి.అన్నారాము, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రవిచక్రవర్తి, జిల్లా అధ్యక్షులు కెవివి.నగేష్, అసోసియేట్ అధ్యక్షులు బి.నాగమణి, వివి.రమణ పాల్గొన్నారు.
పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థి బొర్రా గోపి మూర్తి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని దూబచర్ల, నల్లజర్ల, అనంతపల్లి ఉన్నత పాఠశాలలను ఆయన గురుఆరం సందర్శించారు. షేక్ షాబ్జీ ఆశయ సాధనకు కట్టుబడి పని చేస్తూ ఉపాధ్యాయ సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తానన్నారు. ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ఉఏ విధంగానూ ఉపయోగపడకపోగా వారి ప్రాణాలను హరిస్తున్నాయన్నారు. ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా ఉన్న ఈ శిక్షణా తరగతులను రద్దు చేసి ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌లో, లేదా మరొక విధంగా శిక్షణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్, కార్యదర్శి సిహెచ్‌ఎస్‌ఎస్. మనోహర్ కుమార్, మండల అధ్యక్షుడు ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. జిల్లా మాజీ కార్యదర్శి ఐవి.సత్యం తదితరులు పాల్గొన్నారు.