ప్రజాశక్తి – పిఠాపురం
టిడిపి అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎన్.వర్మ అన్నారు. సోమవారం స్థానిక టిడిపి కార్యాల యంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 23 ఏళ్లుగా టిడిపి అధినేత చంద్రబాబుతోనే తన ప్రయాణం కొనసాగించానని, అధికారంలో ఉన్న లేకపోయి నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పని చేశానన్నారు. పార్టీకి, ప్రజలకు అండగా ముందు కు వెళుతున్ననన్నారు. తనకి ప్రజా సేవ చేయడా నికి అవకాశం కల్పించడమే చంద్రబాబు తనికి ఇచ్చిన గొప్ప పదవన్నారు. పిఠాపురం టిడిపి శ్రేణులు మొత్తం చంద్రబాబు, భవిష్యత్ రథసారథి మంత్రి లోకేష్‌కి అండగా ఉండాలని, వారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానన్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పార్టీని బలపరుస్తూ పిఠాపురం టిడిపి నడుస్తుందని, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. పదవులు కేటాయించేటప్పుడు అధినేత ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని నాయకులు, కార్యకర్తలు, అర్ధం చేసుకోవాలన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి గత ఎన్నికల్లో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి కూటమి విజయానికి కృషి చేశామన్నారు.