ప్రజాశక్తి – కాకినాడ
ముస్లిం, మైనారీటిల హక్కులను హరిస్తున్న వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లిం వక్ఫ్‌్ జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం వక్ఫ్‌్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ముస్లిం వక్ఫ్ జేఎసి ఆధ్వర్యంలో ముస్లింలు నగరంలో కదంతొక్కారు. నగరంలోని మెయిన్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ముస్లిం వక్ఫ్ జెఎసి కో కన్వీనర్, ప్రముఖ న్యాయవాది జవహర్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో వక్ఫ్‌ను కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి, రక్షించండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ షాన్ మోహన్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు జవహర్ అలీ, నజ్మాలు, ఇమామ్ గౌస్మెహిద్దీన్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని ముస్లిం, మైనారిటీలు తీవ్రంగా వ్యతిరేస్తున్నట్లు చెప్పారు. వక్ఫ్ ఆస్తులన్నీ ముస్లిం దాతలు తమ అభీష్టం మేరకు ముస్లిం సమాజం కోసం దానం చేశారని గుర్తు చేశారు. ఆ ఆస్తులు ప్రభుత్వాలకు సంబంధం లేదన్నారు. ఈ చట్టం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పాదర్శకత, జవాబుదారీతనం, సామర్ధ్యాన్ని పెంచడానికి ఉద్దేశించినది కాదన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వక్ఫ్ జెఎసి నాయకులు తాజువుద్దీన్, అబ్దుల్ బషీరువుద్దీన్, రహ్మన్కాన్, రహీం, కుతుబుద్దీన్, జిలాని దురాని, ఇమామ్లు అబ్దుల్ రజాక్ రిజ్వీ, గౌస్ మొహిద్దీన్, మాజీ కార్పోరేటర్ తహీరాఖాతూన్, జామాతే ఇస్లాం హీంద్ నాయకురాలు నజ్మా తదితరులు పాల్గొన్నారు.