53వ రోజుకు కార్మికుల ఆందోళన

Jan 7,2025 23:27
ఆందోళన మంగళవారం నాటికి 53వ రోజుకు చేరింది.

ప్రజాశక్తి – ఏలేశ్వరం

మండలంలోని చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 53వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా వర్కింగ్‌ కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ గత 53 రోజులుగా కార్మికులు ఆకలితో అలమటిస్తూ అనేక రూపాల్లో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కానీ ప్రజాప్రతినిధుల్లో కాని, ప్రభుత్వం నుంచి కానీ ఏమాత్రం స్పందన రాకపోవడం బాధాకరమని అన్నారు.కార్మిక సమస్యలను పరిష్కరించలేమని యాజమాన్యం మొండికేయడం సరికాదన్నారు. తక్షణమే ప్రభుత్వం కల్పించుకుని ఫ్యాక్టరీని తెరిపించి 409 మంది కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. అప్పటి వరకూ తమ ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి వీరబాబు, చక్రధర్‌, గోవిందు, ధర్మాజీ, బి.ఆది, ఎం.కాంతారావు, రామదుర్గ, జయలక్ష్మి, అన్నపూర్ణ, శివలక్ష్మి, పాపారత్నం, చంటి, వరలక్ష్మి పాల్గొన్నారు.

➡️