రాక్ సిరామిక్స్ ఎదుట కార్మికుల ధ‌ర్నా

Jun 10,2024 15:03 #Kakinada

ప్రజాశక్తి – సామర్లకోట : తొల‌గించిన కార్మికుల‌ను త‌క్ష‌ణం విధుల్లోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ సామర్లకోట ఏ డి బీ రోడ్ లో రాక్‌సిరామిక్స్ పరిశ్రమ గేటు ముందు సిఐటియు ఆధ్వ‌ర్యంలో కార్మికులు ప్ల కార్డులు చేతపట్టి ధ‌ర్నా నిర్వ‌హించారు. సుమారు. 15 సంవ‌త్స‌రాలుగా ప‌ని చేస్తున్న కార్మికుల‌ను అర్ధాంత‌రంగా బ‌య‌ట‌కు పంప‌డం దారుణ‌మ‌ని కార్మికులు ఆవేద‌న వ్య‌క్తం చేసారు. దేశ‌వ్యాపితంగా అత్యంత లాభాల‌తో న‌డుస్తున్న రాక్ సిరామిక్స్ మ‌రింత లాభాలు గ‌డించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు. కార్మిక చ‌ట్టాలు అమ‌లు చేయకుండా ముందుగా ఎటువంటి నోటీసులు ఇవ్వ‌కుండా కార్మికుల‌ను తొల‌గించ‌డం దారుణ‌మ‌న్నారు. కార్మిక శాఖ కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని చెప్పినా వారి మాట కూడా పెడ‌చెవిన పెట్టింద‌ని అన్నారు. త‌క్ష‌ణం కార్మికుల‌ను విదుల్లోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో సిఐటియు జిల్లా కార్య‌ద‌ర్శి డి. క్రాంతికుమార్‌, రాక్‌వ‌ర్క‌ర్లు చంద్రశేఖర్, సతీష్, రామకృష్ణ, వరప్రసాద్, మల్లికార్జునరావు, గంగాధర్, క్రాంతి, మంగారావు, అర్జున్ రావు, మూర్తి, సత్యనారాయణ, చంద్రన్న, ప్రభుదాస్, రామచంద్రయ్య, రాజబాబు, సతీష్ కుమార్, శివ నారాయణ, సుబ్బారావు త‌దిత‌రులు పాల్గోన్నారు.

➡️