ప్రజాశక్తి – జగ్గంపేట
జగ్గంపేట డిగ్రీ కళాశాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వ నిధులతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులను రాబట్టేందుకు కృషి చేస్తున్నట్లు ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకూ కళాశాల ఏవిధమైన అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తమ ప్రభుత్వ పాలనలో కళాశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతోపాటు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను రూ.35 లక్షల నిధులను కోరిన వెంటనే మంజూరు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎస్‌విఎస్.అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, చిలకూరి రామ్‌కుమార్, దాట్ల కృష్ణవర్మ, కామినేని జయశ్రీ పాల్గొన్నారు..