ప్రజాశక్తి-ప్రత్తిపాడు : ప్రజా పక్షాన పోరాటానికై ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ సీపీ జనం గుండెల్లో నాటుకుపోయిన పార్టీ అని ఇన్చార్జి ముద్రగడ గిరిబాబు అన్నారు. కిర్లంపూడిలో ముద్రగడ నివాసం నుండి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, కోఆర్డినేటర్ గిరిబాబు ఆధ్వర్యంలో భారీ కాన్యాయి తో బయలుదేరి ప్రత్తిపాడుకు చేరుకున్నారు. ప్రత్తిపాడులో వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి జెండా ఎగరవేసి కేకు కట్ చేశారు. గిరిబాబు మాట్లాడుతూ పేదల సంక్షేమానికే వైఎస్ఆర్సిపి ఆవిర్భంచందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
