సికిల్‌సెల్‌ ఎనిమియాపై అవగాహనకు కళాజాతా

సికిల్‌సెల్‌ ఎనిమియాపై అవగాహనకు కళాజాతా

ప్రజాశక్తి -డుంబ్రిగుడ: సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధిపై అవగాహనకు డుంబ్రిగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విఎస్‌ఆర్‌ రూరల్‌ మీడియా కళాజాతా జైశంకర్‌, శివశంకర్‌ బృందం ఆధ్వర్యంలో గురువారం కళాజాతా ప్రదర్శన నిర్వహించారు. సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధి సోకిన వారికి ఏ విధమైన వైద్య సేవలు చేసుకోవాలనే దానిపై గేయాలు, నృత్యాల రూపంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక పిహెచ్‌సి వైద్యాధికారి పి రాంబాబు మాట్లాడుతూ సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధిగ్రస్తులకు అకస్మాత్తుగా రక్తంశాతం తగ్గి, అస్వస్థతకు గురౌతారని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సరైన పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ప్రభుత్వపరంగా ఈ వ్యాధిపై అవగాహనకు ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం అందించే సలహా సూచనలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్‌ అంబిక , ఎంపిహెచ్‌ఇఒ జె శౌరి, వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తలు, కళాజాత బృందం సభ్యులు పాల్గొన్నారు.

కళాజాతా తిలకిస్తున్న గిరిజనులు

➡️