ప్రజాశక్తి – చిప్పగిరి : మండల పరిధిలోని నేమకల్లు గ్రామ పశు వైద్య అధికారిగా కమలమ్మ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న మహేష్ ఏలూరుకు వెళ్లడంతో ఆమె ఇక్కడ విధులలో చేరారు. ఆమె మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పశువులకు ఏ డిసీస్ వచ్చిన వెంటనే టీకాలు వేస్తామన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు రాయితీపై ఏది వచ్చినా వెంటనే సమాచారం ఇచ్చి వచ్చేలా కృషి చేస్తానన్నారు. బర్రెలకు అత్యవసరంగా ఏదైనా సమస్య వచ్చిన పశు వైద్యశాలకు తీసుకుని వస్తే వెంటనే టీకాలు వేస్తామన్నారు.
