కన్నబిడ్డలపై కన్నేసిన కామాంధుడు అరెస్ట్‌

తిరుపతి సిటీ : కన్న బిడ్డలపై కన్నేసిన కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు …. నిమ్మనపల్లి మండలం, కొండయ్యగారిపల్లి పంచాయతీ దాసరి పేటలో నివాసముంటున్న బోయకొండ (38) తన కన్న బిడ్డలపై కామవాంఛ తీర్చుకుంటుండగా భార్య కంటపడింది. దీంతో ఆమె వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు పిల్లలను వెంటనే వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మదనపల్లె రూరల్‌ సర్కిల్‌ సిఐ రమేష్‌ ఘటనపై పోక్సో కేసు నమోదు చేశారు.

➡️