ప్రజాశక్తి-రాయచోటి ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి రైతు బజార్‌లో రాయి తీపై కందిపప్పు, బియ్యం ఇస్తున్నారని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ పేర్కొన్నారు. గురువారం రాయచోటి రైతుబజార్‌లో రాయితీపై కందిపప్పు, బియ్యం పంపిణీ కేంద్రాలను జెసి ప్రారంభించారు. మార్కెటింగ్ శాఖకు సంబంధించి ఇద్దరు చిరు వ్యాపారుల షాపులను కూడా ఆయన ప్రారంభించారు. రైతుబజార్‌లో ఖాళీగా ఉన్న షాపులను భర్తీ చేయుటకు రోడ్డు సైడ్ ఉన్న చిన్న చిన్న వ్యాపారులు ఎవరైనా టీ కొట్టు, డ్రై ఫ్రూట్స్, ఆయిల్ విక్రేతలు, టైలరింగ్, జనరల్ షాప్ తది తర వ్యాపారాలు చేసుకునే వారు రైతు బజార్లో షాపులు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్‌కు ఈనెల 3వ తేదీన ఆదేశాలు జారీ చేశా మని తెలిపారు. ముందుకు వచ్చిన 9 మంది చిరువ్యాపారులకు నామ మాత్రపు అద్దెకు రైతు బజార్లో షాపులు కేటాయించామన్నారు. దరఖాస్తు చేసు కున్న ఆరు గురికి షాపులు కేటాయించాల్సి ఉందన్నారు. వాటిని కూడా త్వరగా మంజూరు చేసి కేటాయించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మిగిలి ఉన్న షాపుల భర్తీ కొరకు ఆసక్తి కలిగిన చిరు వ్యాపారులు ఎవరైనా మాసా పేటలోని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కార్యాలయంలో తమ వివరాలతో దరఖాస్తు సమర్పించవచ్చునని తెలిపారు. అనంతరం మదనపల్లి మార్కెట్ యార్డును జెసి సందర్శించారు. ఒకే దేశం ఒకే ఉత్పత్తి అమలులో భాగంగా మార్కెట్ యార్డుకు ఉత్పత్తులు శాతం ఎంత, ఎంత మేర వస్తున్నాయి తదిత రాలను పరిశీలించి ఉత్పత్తులను రాష్ట్రం వెలుపలికి రవాణా చేయు అంశా లపై అధికారులతో చర్చించి తగు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో రాయ చోటి ఆర్‌డిఒ రంగస్వామి, మార్కెటింగ్ శాఖ ఏడీ త్యాగరాజు, డిఎస్‌ఒ రఘు రాం, జిల్లా మేనేజరు శివరాం, రైస్, దాల్‌మిల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
