ప్రజాశక్తి-దర్శి : ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న కందిపప్పు, సన్న బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టిడిపి కూటమి దర్శి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి నగర పంచాయతీలోని గడియార స్తంభం సెంటర్, రామాలయం మరియు శివరాజ్ నగర్‌లో పౌర సరఫరాల శాఖ ద్వారా సబ్సిడీపై కందిపపు, సన్నబియ్యం పంపిణీని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని పథకాలు ప్రవేశ పెడుతూ ప్రజల అవసరాలు తీరుస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య, కమిషనర్ మహేశ్వరరావు, ఆర్‌ఐ నరసింహారావు, విఆర్‌ఒ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు విసి.రెడ్డి దారం సుబ్బారావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, నాj ుకులు జూపల్లి కోటేశ్వరరావు, వెంకటరావు, వై. సుబ్బయ్య నాగమణి పాల్గొన్నారు.గిద్దలూరు : గిద్దలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్, మున్సిపల్ కాంప్లెక్ రూమ్ 1 లో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబిడ్సీపై కందిపప్పు, బియ్యం పంపిణీ కేంద్రాలను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సోదరుడు ముత్తుముల కృష్ణకిషోర్, మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సిద్ధార్ద, టిడిపి నాయకులు సయ్యద్ షానేశా వలి, పాలుగుళ్ల చిన్న శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
