ట్రాఫిక్‌ పోలీసులకు వైట్‌ హ్యాట్‌, కూలింగ్‌ గ్లాసెస్‌ అందచేసిన కనిగిరి డిఎస్‌పిపి సాయి ఈశ్వర్‌ యశ్వంత్‌

కనిగిరి (ప్రకాశం) : కనిగిరి పట్టణంలో ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఎండ నుండి, వడ దెబ్బ నుండి తమను తాము రక్షించుకోడానికి ట్రాఫిక్‌ పోలీసులకు కనిగిరి డీఎస్పీ పి సాయి ఈశ్వర్‌ యశ్వంత్‌, సీఐ ఖాజావళి, ఎస్‌ఐ శ్రీరామ్‌ సహకారంతో వైట్‌ హ్యాట్‌, కూలింగ్‌ గ్లాస్‌ లను మంగళవారం పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా కనిగిరి పట్టణం లో ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చక్కగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ట్రాఫిక్‌ నిర్వహణ చేస్తు ప్రజల మన్ననలు పొందాలని డిఎస్పీ వారికి సూచించారు.

➡️