గెలుపునకు సహకరించాలి: కరణం వెంకటేష్‌

ప్రజాశక్తి-చీరాల: జరగనున్న ఎన్నికలలో పూర్తి మద్దతును అందించి తన గెలుపునకు సహకరిం చాలని వైసిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌ అన్నారు. బుధ వారం స్థానిక ఉడ్‌నగర్‌లోని ఆయన పర్యటించారు. వైసీపీ డాక్టర్స్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి, ప్రేమ హాస్పిటల్‌ ఎండి డాక్టర్‌ బాబురావు దంపతులను, మాజీ చైర్మన్‌, సీనియర్‌ నాయకులు సలగల దేవదానం దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎన్నికలలో తనకు పూర్తి మద్దతును అందజేసి తన గెలుపునకు సహకరించాలని వారిని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ గురించి కొద్దిసేపు వారితో చర్చించారు. ఆయన వెంట మునిసిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు, పలువురు కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.

➡️