స్థలం కేటాయింపునకు కషి చేస్తా

ప్రజాశక్తి-బాపట్ల: భావపురి సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ భవనానికి స్థలం కేటాయింపునకు తమ వంతు కషి చేస్తానని బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌ నిర్మల్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ వద్ధుల దినోత్సవం సందర్భంగా భావపురి సీని యర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలో ఎన్జీవో హౌంలో నిర్వహించిన కార్యక్రమానికి కమిషనర్‌ నిర్మల్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ సూచనల మేరకు భావపురి సీనియర్‌ సిటిజన్స్‌ అసోసి యేషన్‌ భవనానికి స్థల సేకరణకు చర్యలు తీసుకుంటామ న్నారు. పర్యావరణహితంగా పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారంతో పాటు సీనియర్‌ సిటిజన్స్‌ సలహాలు సూచనలు అవసరమన్నారు. ప్రధానంగా పట్టణంలో ప్లాస్టిక్‌ నియంత్ర ణకు ప్రజలు సహకరించాలన్నారు. ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజల్లో ప్రచారం నిర్వహించాలన్నారు. అందుకు సీనియర్‌ సిటిజన్స్‌ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాల్లో భాగంగా ప్లాస్టిక్‌ వినియోగం వల్ల పర్యావరణ ముప్పుతో భావితరాలకు కలిగే అనర్థాలపట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత సీనియర్‌ సిటిజన్స్‌పై ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ సిటిజెన్స్‌ ను అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి భావపురి సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాగిత శ్రీహరి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కెఎస్‌టి సాయి, ప్రముఖ వైద్యులు కేసన వెంకట నరేంద్ర, జిల్లా సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జివి బ్రహ్మం, పిసి సాయిబాబు, బందా బాబు, ప్రముఖ వైద్యులు కవి డాక్టర్‌ శ్రీనివాస్‌, విశ్రాంత తహశీల్దార్‌ సిద్దయ్య, ప్రముఖ కవి పులుగు చిన వీర రాఘవులు, పలువురి సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

➡️