20 నుండి ఎఎన్‌యులో కాశ్మీర్‌ యూత్‌ ఎక్స్ఛేంజ్‌ కార్యక్రమం

Oct 9,2024 23:54

మాట్లాడుతున్న జెసి భార్గవ్‌ తేజ
ప్రజాశక్తి-గుంటూరు :
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈనెల 20వ తేది నుండి 25 వరకు జరిగే కాశ్మీర్‌ యూత్‌ ఎక్స్ఛేంజ్‌ కార్యక్రమం ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని నెహ్రూ యువకేంద్ర అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎ.భార్గవ్‌తేజ ఆదేశించారు. ఏర్పాట్లపై అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం సమీక్షించారు. భారత ప్రభుత్వం, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువకేంద్ర, గుంటూరు ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 5 రోజుల పాటు ఎఎన్‌యులో జరిగే కార్యక్రమంలో కాశ్మీర్‌లోని 6 జిల్లాల నుంచి 132 మంది యువత పాల్గొంటారన్నారు. వీరికి ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో బస ఏర్పాట్లు చేయాలన్నారు. మొదటి రోజు నుండి కార్యక్రమం పూర్తయ్యే వరకు వారికి రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖాధికారులను ఆదేశించారు. సమీక్షలో గుంటూరు నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి కిరణ్మయిదేవిరెడ్డి, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ కె.విజయలక్ష్మి, జిల్లా పంచాయతి ఆఫిసర్‌ బి.వి.ఎన్‌.సాయికుమార్‌, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్‌ అఫ్‌ ట్రాన్స్పోర్ట్‌ కె.శ్రీహరి, జిల్లా టూరిజం అధికారి ఎఏ.శ్రీరమ్య, జిల్లా క్షేత్ర ప్రచార అధికారి రమేష్‌ చంద్ర, ఐఅండ్‌పిఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అబ్దుల్‌ రఫీక్‌ పాల్గొన్నారు.

➡️