యల్లనూరు (అనంతపురం) : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తిమ్మంపల్లిలోని తన స్వగఅహంలో సోమవారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గం లోని తన స్వగఅహనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుపడుతున్నారని ఇటీవల కోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీంతో కోర్టు ఉత్తర్వుల మేరకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిబ్రవరి 3న తాడిపత్రి కి వెళుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈరోజు తన నివాసం నుండి తాడిపత్రి కి బయలుదేరుతున్న విషయం తెలుసుకున్న సింగనమల నియోజకవర్గ సిఐ, పుట్లూరు సిఐ సత్యబాబు సుమారు 200 మంది పోలీసులతో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్బంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ … ఇలాంటి అవరోధాలు ఎన్ని కలిగించిన తాడిపత్రి కి వెళ్లకుండా అడ్డుకోలేరని అన్నారు. చట్టం పై గౌరవం ఉందన్నారు. ఏదో ఒక రోజు వస్తుందని అప్పుడు తాడిపత్రి కి వెళ్లకుండా తనను
ఎవరు ఆపలేరని అన్నారు.
