‘ హామీని నిలబెట్టుకోండి – బిఎన్‌ఆర్‌ రోడ్డు గోతులను పూడ్చండి ‘ : సిపిఎం ఆందోళన

Oct 1,2024 10:49 #BNR road silos, #CPM agitation

రావికమతం (అనకాపల్లి) : ‘ హామీని నిలబెట్టుకోండి – బిఎన్‌ఆర్‌ రోడ్డు గోతులను పూడ్చండి ‘ అంటూ … సిపిఎం ఆధ్వర్యంలో ఆ రోడ్డుపై నేతలు, స్థానికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట హై స్కూల్‌ వద్ద ఉదయం 7:30 గంటలకి జనాల బరువుతో వస్తున్న లారీ బిఎన్‌.రోడ్డు మధ్యలో కూరుకుపోయింది. దీంతో బస్సులోని ప్రయాణీకులు తీవ్రమైన ఇబ్బందులుపడ్డారు. వీరితోపాటు స్కూల్‌ పిల్లలు, వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ప్రభుత్వం వంద రోజులు పరిపాలన ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఎంపీ సిఎం.రమేష్‌ గెలిచిన వెంటనే ముఖ్యంగా బి.ఎన్‌ రోడ్డు భారీ గొయ్యిలను వెంటనే పూరిస్తామని హామీ ఇచ్చారు. బిఎన్‌.రోడ్డు విషయంలో మాత్రం ప్రయాణికులు అనేక ఇబ్బందులు గురవడంతో పాటు రోడ్లే అనేకమంది ప్రయాణికులను హత్య చేస్తున్నాయి. ఇప్పటికే అనేకమంది మరణించారు. కనీసం ప్రభుత్వం కానీ, ఆర్‌ అండ్‌ బి అధికారులు కానీ ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఎన్నికల్లో ఎంపి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి బిఎన్‌ఆర్‌ రోడ్డు గోతులను పూడ్చండి అని నినదిస్తూ ఆందోళన చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️