గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచండి

Jun 10,2024 20:44
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచండి

చెత్తను పరిశీలిస్తున్న నాయకులు
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచండి
ప్రజాశక్తి-కోవూరు :మండలంలోని పోతి రెడ్డిపాలెం గ్రామంలో పారి శుధ్యం పూర్తిగా పడకేసి ఉందని పంచాయతీ అధికారులకు ప్రత్యక్షంగా స్థానిక ఎంపిటిసి యద్ధలపూడి నాగరాజు, మాజీ సర్పంచ్‌ అంగిరేకుల కృష్ణ ప్రసాద్‌లు చూపించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామంలో రోజురోజుకీ పారిశుధ్య పరిస్థితులు దిగజారుతున్నాయన్నారు. ఎన్నికల ముందు వరకు ఎక్కడా కనపడని మురుగు, చెత్త కుప్పలు ఇప్పుడు దర్శనమిస్తున్నాయన్నారు. పారిశుధ్యం పై అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. రోడ్లపై ఉన్న చెత్త కుండీలు నిండి కంపు కొడుతున్నాయన్నారు. గ్రామంలో ఇంటింటి చెత్తకుండీల వద్ద పడవేసిన చెత్తను తొలగించలేని పరిస్థితి ఏర్పడిందంటే నిర్లక్ష్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇంటింటి చెత్త సేకరించిన పారిశుధ్య కార్మికులు చెత్తను కుండీల వద్ద వేస్తున్నారన్నారు. కుండీల వద్ద పేరుకుపోయిన చెత్తను ట్రాక్టర్లు,ఆటోల ద్వారా డంపింగ్‌ యార్డుకు తరలించే ప్రక్రియ ఉండేదన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి సక్రంగా కొనసాగడం లేదన్నారు. గ్రామంలో మురుగు కాలువల క్లీనింగ్‌ కూడా తరచుగా జరగడం లేదన్నారు. గతంలో వారానికి 15 రోజులకు ఒకసారి మురుగు కాలవలు క్లీన్‌ చేసే ఆనవాయితీ ఉందన్నారు. కాలువల నుంచి తీసిన పూడికను అప్పటికప్పుడే బయటికి తరలించ ేవారని తెలిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కాలువల్లో తీసిన పూడిక కుప్పలు కుప్పలుగా రోడ్లపై దర్శన మిస్తున్నాయన్నారు. ఆ కుప్పలు ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురి కావడమే కాకుండా అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు.

➡️