కేంద్ర సాహిత్య అకాడమీ సభలో ఆచార్య పి.పద్మప్రజాశక్తి – కడప అర్బన్ అభ్యుదయ రచయితగా రైతులు, పేదలు, పీడితుల పక్షాన నిలిచిన గొప్ప కథారచయిత కేతు విశ్వనాథరెడ్డి అని రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ అన్నారు. గురువారం వైవీయూ, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం ఆర్ట్స్ బిల్డింగ్‌లోని కవయిత్రి మొల్ల సమావేశ మందిరంలో ప్రసిద్ధ తెలుగు రచయిత కేతు విశ్వనాథ రెడ్డి జీవితం, రచనలపై ‘నా దష్టిలో..’ పేరుతో సాహిత్య కార్యక్రమం నిర్వహించారు. సాహిత్య అకాడమీ సభ్యులు వైవీయూ తెలుగుశాఖ ఆచార్యులు ఎం.ఎం.వినోదిని అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభకు ముఖ్య అతిథిగా ఆచార్య పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాహిత్య అకాడమీ దేశంలోని 24 భాషల అభివద్దికి కషిచేస్తోందన్నారు. దేశ సంస్కతి, సంప్రదాయాలను కాపాడుతోందని గుర్తు చేశారు. పీజీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎస్.రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ రైతుల దుర్భర జీవితం వారి ఆకలి బాధలు కేతు విశ్వనాథరెడ్డి రచనల్లో కనిపిస్తాయన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్రసిద్ధ తెలుగు రచయిత్రి ఆచార్య కాత్యాయనీ విద్మహే కీలక ఉపన్యాసం చేస్తూ వర్తమాన సామాజిక దుర్మార్గాలను సాంస్కతిక కోణం నుంచి ఎదుర్కొన్న రచయిత కేతు విశ్వనాథ రెడ్డి తెలిపారు. కులమత అసంబద్ధాలు, అపోహలు తొలగి పోవాలంటే ఆయన కథలు చదవాలన్నారు. వర్తమాన సమాజానికి అవసరమైన లౌకిక ప్రజాస్వామ్య భావనలు కలిగిన కథా రచయిత కేతు అన్నారు. విశ్వనాథరెడ్డి తోటి విద్యార్థులతో స్నేహంగా మెలుగుతూ జ్ఞానచైతన్యం చేసేవారన్నారు. మార్క్సిస్టు దక్పథం కలిగిన అభ్యుదయ వాది ఆచార్య కేతు అని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ట్స్ విభాగ డీన్ ఆచార్య కంకణాల గంగయ్య, తెలుగుశాఖ ఆచార్యులు రమాదేవి, కవిత విద్య సాంస్కతిక సేవ సంస్థ వ్యవస్థాపకులు అలపర్తి పిచ్చయ్య చౌదరి, ఆచార్య కష్ణ కుమారి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.