ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ (గుంటూరు) : మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టిడిపి తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు ఆధ్వర్యంలో శుక్రవారం ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి ఆంధ్ర రత్న పంపింగ్ స్కీం ద్వారా ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేశారు. ముందుగా ఆంధ్ర రత్న పంపింగ్ స్కీం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం టిడిపి తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మోటార్ స్విచ్ ఆన్ చేసి పంట పొలాలకు నీటిని విడుదల చేశారు.
