కిడ్నాప్‌ కేసు ఛేదింపు

Jul 5,2024 20:10
కిడ్నాప్‌ కేసు ఛేదింపు

పోలీసుల అదుపులో నిందితుడుకిడ్నాప్‌ కేసు ఛేదింపుపోలీసుల అదుపులో నిందితుడు-పోలీసులకు ఎఎస్‌పి అభినందనలు..ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:బాలిక కిడ్నాప్‌ కేసును అత్యంత చాకచక్యంగా పోలీసులు ఛేదించారు. తోటపల్లిగూడూరు పోలీసులను అడిషనల్‌ ఎస్‌పి (అడ్మిన్‌) సిహెచ్‌ సౌజన్య ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం మీడియా సమావేశంలో అందించిన సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి. పట్టపు శాంతి కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో విడిపోయి కుమార్తె, కుమారుడితో కలసి తోటపల్లిగూడూరు మండలం వెంక న్నపాలెం గ్రామంలో కూలిపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. భర్తతో విభేదాల కారణంగా విడిపోయిన శాంతి మూడు సంవత్సరాల క్రితం కనిగిరి మండలం, బల్లిపల్లి పంచాయితీ, విశ్వనాథపురం గ్రామానికి చెందిన కొమ్మి మల్లికార్జునను పెళ్లి చేసుకొని వెంకన్నపాలెం గ్రామంలో కాపురం పెట్ట్టింది. వీరి మధ్య కూడా మనస్పర్ధలు నెలకొన్నాయి. దాంతో భార్యపై కక్ష సాధించాలనే ఉద్దేశంతో నిందితుడు మల్లిఖార్జున మహాలక్ష్మీపురం గ్రామంలోని స్కూల్‌ బట్టలు కొనిస్తానని మాయ మాటలు చెప్పి నమ్మించి శాంతి కుమా ర్తెను గత నెల 29వ తేదీ మోటార్‌ సైకిల్‌ పై ఎక్కించుకొని తన స్వగ్రామమైన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం, బల్లిపల్లికి తీసుకెళ్లడం జరిగింది. తన కుమార్తె కనిపించడం లేదంటూ బాలిక తల్లి శాంతి గత నెల 30వ తేదీ తోట పల్లిగూడూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్‌ఐ జంపాని కుమార్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. జిల్లా ఇన్‌ఛార్జ్జ్‌్‌ ఎస్‌పి గరుడ్‌ సుమిత్‌ సునీల్‌, అడిషనల్‌ ఎస్‌పి సౌజన్య ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్‌ ఇన్‌ఛార్జి డిఎస్‌పి డి. శ్రీనివాస రెడ్డి, కృష్ణపట్నం పోర్టు సిఐ వెం కట రెడ్డి సూచనల మేరకు ఎ స్‌ఐ జంపాని కుమార్‌ బాలిక మిస్సింగ్‌ కేసును ఛాలెంజ్‌ గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత ఆధారంగా కనిగిరి మండలం, బల్లిపల్లి పంచాయితీ అటవీ ప్రాం తంలో నిందితుడు మల్లిఖార్జున్‌ ఉన్నట్లు గుర్తించారు. చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద బందీగా ఉన్న బాలికను సురక్షితంగా తల్లి శాంతికి అప్పగించారు. బాలిక మిస్సింగ్‌ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన నెల్లూరు రూరల్‌ ఇన్‌ఛార్జి డిఎస్‌పి శ్రీనివాస రెడ్డి, పోర్టు సిఐ వెంకట రెడ్డి, టీపీ గూడూరు ఎస్‌ఐ జంపాని కుమార్‌, సిబ్బందిని అభినందించి, రివార్డులు అందించారు.

➡️