ప్రజాశక్తి-నిజాంపట్నం: నిజాంపట్నం మండలంలోని దిండి సమీపంలోని మడ అడవిలో నాటు సారా బట్టీలను ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ మార్టురి శ్రీరామ్ ప్రసాద్ శనివారం ధ్వంసం చేశారు. అదవల, పరిశవారిపాలెం, యేమినేనివారిపాలెం పరిసర ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. మూడు ప్రాంతాలలో నాటు సారా తయారీ కోసం దాచి ఉంచిన మొత్తం 700 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ డైరెక్టర్ అఫ్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఆదేశాల మేరకు నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు.