ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న రఘురామకృష్ణం రాజు

విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని రఘురామకృష్ణం రాజు శనివారం దర్శించుకున్నారు. అనంతరం రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ … ఐదు సంవత్సరాల క్రితం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చానన్నారు. గత ప్రభుత్వం ఆంధ్ర లోకి రాకుండా ఆంక్షలు విధించిందని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చి అమ్మని దర్శించుకున్నానని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయన్నారు. లడ్డు ప్రసాదం అనేది తిరుమల లోనైనా అమ్మవారిదైనా ప్రసాదం గానే భావించి తింటామని చెప్పారు.

➡️