వైభవంగా కోదండరాముడి రథోత్సవం

Apr 12,2025 21:48

ప్రజాశక్తి-ఒంటిమిట్టఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఏడవ రోజు శనివారం స్వామివారి రథోత్సవం అంగ రంగ వైభవంగా జరిగింది. ఉదయం 10.30 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. శ్రీసీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు. భజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. కార్యక్రమంలో టిటిడి అదనపు ఇఒ సిహెచ్‌.వెంకయ్య చౌదరి, జెఇఒ వి.వీరబ్రహ్మం, డెప్యూటీ ఇఒ నటేష్‌ బాబు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, ఇంజినీరింగ్‌ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.రేపు చక్రస్నానం : శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు సోమవారం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు ధ్వజావ రోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.15న పుష్పయాగం : శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో 10వ రోజు మంగళవారం సాయంత్రం 6 నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

➡️