సైనిక్‌ స్కూల్‌లో ప్రవేశానికిజి. కోడూరు విద్యార్థి ఎంపిక

సైనిక్‌ స్కూల్‌

ప్రజాశక్తి-అనకాపల్లి డెస్క్‌ : మాకవరపాలెం మండలంలోని జి కోడూరు గ్రామానికి చెందిన విద్యార్థి గంగిరెడ్ల తనుష్‌కుమార్‌ సైనిక్‌ స్కూలులో ప్రవేశానికి ఎంపికయ్యాడు. స్థానిక ఎస్‌జికె పాఠశాలలో చదువుతున్న గంగిరెడ్ల తనుష్‌కుమార్‌ సైనిక్‌ స్కూల్లో ఆరోతరగతిలో ప్రవేశానికి పరీక్ష రాశాడు. ఈ పరీక్షలో ఉత్తీర్ణతతోపాటు మంచి మార్కులు, ర్యాంకు సాధించడంతో రాజస్థాన్‌లోని గంగానగర్‌ సైనిక్‌ స్కూలులో ప్రవేశానికి ఎంపికయ్యాడని పాఠశాల కరస్పాండెంట్‌ వీరప్రకాశ్‌ తెలిపారు. ఈమేరకు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లోని ఎంఎస్‌ఎం సైనిక స్కూల్‌లో తనుష్‌కుమార్‌కు ప్రవేశార్హత వచ్చిందని అక్కడి పాఠశాల నుంచి విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందింది. కాగా తనుష్‌ కుమార్‌కు రాజస్థాన్‌లోని సైనిక్‌స్కూల్‌లో సీటు దక్కడంపై తనుష్‌తోపాటు అతని తల్లిదండ్రులను పాఠశాల కరస్పాండెంట్‌తోపాటుపలువురు అభినందించారు.

గంగిరెడ్ల తనుష్‌కుమార్‌

➡️