తిరుపతి సిటీ : సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నాకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి మంగళవారం విచ్చేసిన ఆయన దర్శనం అనంతరం తిరుపతిలోని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో చైల్డ్ క్రీడాకారులను పరిచయం చేసుకొని, మీడియాతో మాట్లాడుతూ … ఎప్పటికైనా భారతదేశం తరుపున ఆడాలనేది చాలా చిన్ననాటి కల అని దాని సహకారం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ప్రత్యేకించి ప్రణాళికలు ఏమి చేయలేదని, తన ఆటను తాను ఆడానని తెలిపారు. సీనియర్లు అందరూ విఫలమైన ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేయటాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనని, ఆరోజు జట్టును ఆదుకోవడం మొదటి క్షణాలని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడగలరు. తమలోని నైపుణ్యానికి వదిలిపెట్టి, తమ శక్తి మేరకు పూర్తిస్థాయి ప్రదర్శన చూపగలిగితే వారి ప్రతిభ కచ్చితంగా వెలుగులోకి వస్తుందని యువ క్రీడాకారులకు సూచించారు. రాబోవు టి20 టోర్నీలో బాగా ఆడేందుకు కసరత్తు చేస్తున్నానన్నారు. భారత జట్టుకు నాయకత్వ విషయం బోర్డు పెద్దలు చూసుకుంటారని, తన ధ్యాస అంతా త్వరలో జరగబోవు టి20 టోర్నమెంట్ పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రియేట్ అసోసియేషన్ సభ్యులు క్రికెట్ విజయ్, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, కార్పొరేటర్లు నరసింహ చారి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
కోహ్లీ నాకు స్ఫూర్తి : యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి
