ప్రజాశక్తి-బాపట్ల : పార్టీ బలోపేతానికి వైసిపి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని వైసిపి రేపల్లె నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ ఈవూరి గణేష్ తెలిపారు. వైసిపి బాపట్ల జిల్లా యువజన అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య గణేష్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా , మండల యువజన విభాగాల కమిటీలను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండల వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
