ప్రజాశక్తి – కర్లపాలెం : కర్లపాలెం మండలం నర్రావారి పాలెం గ్రామంలో నిర్వహిస్తున్న కోన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌తో శుక్రవారం ముగిసింది. చిన్న పులుగ ువారిపాలెం జట్టు నర్రవారిపాలెం జట్టుపై 4 పరుగులు తేడాతో విజయం సాధించి మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన చినపులుగువారి పాలెం జట్టు నిర్ణీత 10 ఓవర్లకు 105 సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నర్రవారిపాలెం జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 101 పరుగులు మాత్రమే సాధిం చింది.ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరికి విజయం చిన పులుగువారిపాలెం జట్టును వరించింది. మూడవ బహు మతిని పేరలి జట్టు సాధించింది. ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఆట్ల ఉర్లరెడ్డి, బెస్ట్ బ్యాట్స్మెన్‌గా పేరలికి చెందిన జోసెఫ్, బెస్ట్ బౌలర్ గా శశి, బెస్ట్ ఆల్ రౌండర్‌గా యల్లావుల వంశీకష్ణ బహుమతులు అందు కున్నారు. ఎంపిపి యారం వనజ, వైసిపి మండల కన్వీనర్ ఏడుకొండలు, పిట్టలవానిపాలెం కన్వీనర్ లీల శ్రీనివాస్ రెడ్డి, బండ్లమ్మ తల్లి దేవ స్థానం మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మార్పు బెనర్జీ, మార్పు రత్నం విజేతలకు బహుమతులు అంద జేశారు. విజేతలకు మొదటి బహుమతిని ప్రముఖ వ్యాపారవేత్త కోన నిఖిల్, రెండవ బహుమతిని మార్పు బెనర్జీ, మూడో బహుమతి యల్లావుల శ్రీనివాసరావు అందజేశారు. వ్యక్తిగత బహుమ తులను నర్రా సుబ్బారావు, మరక రాజు, నర్రా గోపి, మరక మాధవ గోపి, నర్రా నాగరాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో డబ్బుకూటి పథ్వీరాజ్ అక్కల వెంకయ్య స్వామి యల్లవూల మణికంఠ పాల్గొన్నారు.
