పర్యాటక ప్రాంతంగా కోనసీమ

Nov 26,2024 18:37 #Konaseema

 

ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రయత్నాలుకు కార్యరూపం

ప్రజాశక్తి కొత్తపేట : కోనసీమను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని, తద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించాలని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఇటీవల అసెంబ్లీలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన అంశం త్వరలోనే కార్యరూపం దాల్చనుంది అన్నారు. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల ఎగువ భాగం (అప్ స్ట్రీమ్ )నందు బోటు రేసు నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మంగళవారం కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశంలో వెల్లడించారు. జిల్లా పర్యాటక కమిటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లాలో పాసర్లపూడి, ఆదుర్రు గ్రామాలలో బోటింగ్ టెర్మినల్స్ ఏర్పాటు, కోటిపల్లి నందు టూరిజం రిసార్ట్ మరియు ఆపరేషన్ మేనేజ్మెంట్ నిర్వహణ పనులు, ఆత్రేయపురం లొల్ల లాకుల నందు ఫెడల్ బోట్ రేష్ నిర్వహణ అంశాల పురోగతిపై కమిటీ ఆధ్వర్యంలో సమీక్షించారు. జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లొల్ల లాకులు వద్ద ప్రస్తుతం జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ఉన్న కట్టడాలు, ఎక్విప్మెంట్ జోలికి వెళ్లకుండా, మిగిలిన స్థలాన్ని అద్దె ప్రాతిపదికన ఏజెన్సీలకు కేటాయిస్తూ. ఫెడల్ బోట్ రేస్ నిర్వ హణ ద్వారా ఖర్చులు రాబడిని దృష్టిలో ఉంచుకొని పర్యాటక శాఖకు లాభదాయకంగా ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పశ్చిమగో దావరి జిల్లా సిద్ధాంతం లాకుల వద్ద సన్రైజ్ బోట్ రేస్ మాదిరిగా ఆర్థికపర మైన నమూనాలు రూపొందించి డిసెంబర్ మూడు నాటికి సమర్పిం చాలని కలెక్టర్ ఆదేశించారు. సంక్రాంతి పండుగ వేళల్లో గతంలో బోట్ షికారు నిర్వహించిన మత్స్యకార ఏజెన్సీలను మరియు ఇతర చోట్ల ఇదే తరహా బోటు రేసు నిర్వహిస్తున్న పర్యాటక ఏజెన్సీలను సంప్రదించాలని పర్యాట కశాఖ అధికారులను కలెక్టర్ కోరారు. తదుపరి ఈ ప్రాంతాన్ని రిసార్ట్స్ వంటి వసతుల పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. పర్యాటక అధికారులు పూర్తిస్థాయిలో మెకానిజంపై దృష్టి పెట్టి అంచనా లు రూపొందించాల్సి ఉంది. భూముల విలువ, నిర్మాణాల పెట్టుబడి, రెవెన్యూ రాబడి అన్న కోణంలో ప్రామాణిక ఆపరేషన్ ప్రొసీజర్ ను రూపొందించాలని కొత్తపేట ఆర్డిఓ శ్రీకర్ కు కలెక్టర్ భాధ్యతలు అప్పగించారు. లాకులు సుందరీకరణ అభివృద్ధి,ఆపరేషన్ ఏజెన్సీల ఫైనలైజేషన్, రహదారులు భవనాల శాఖ ద్వారా పర్యాటకుల సౌకర్యార్థం బారికేడింగ్ ఏర్పాటు చేయడం తదితర అంశాలపై చర్చించారు. కోనసీమను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి జిల్లాస్థాయిలో కదలిక రావడం వెనుక అసెంబ్లీలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషి ఉంది.. అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకురావడంతో పాటు, మంత్రితో పాటు సంబంధిత అధికారులకు ఇందుకు సంబంధించి ప్రణాళిక అందించడంతో కార్యక్రమం ముందుకు వెళ్తోంది. కొత్తపేట నియోజకవర్గంతో పాటు కోనసీమ ప్రాంత అభివృద్ధికి సీనియర్ శాసనసభ్యులుగా బండారు సత్యానందరావు చేస్తున్న కృషిని అభినందిద్దాం అని అన్నారు

➡️