అంబాజీపేట టిడిపిలో ఆధిపత్య పోరు

Apr 1,2024 23:08
అంబాజీపేట టిడిపిలో ఆధిపత్య పోరు

ప్రజాశక్తి – అంబాజీపేటమండలంలోని టిడిపి నాయకులు పరిచయ వేదికలో రెండు వర్గాలుగా మారి ఆధిపత్య పోరుకు సిద్ధం అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పి.గన్నవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా జనసేన ఇన్చార్జి గిడ్డి సత్యనారాయణ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో బాబులు గారి మిల్లు వద్ద గిడ్డి పరిచయ వేదిక సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్‌ మాధుర్‌ మాట్లాడుతూ మూడు పార్టీల పొత్తు ధర్మం పాటించి సమైక్యంగా అత్యధిక మెజారిటీతో అభ్యర్థులను గెలిపించటానికి కృషి చేయాలన్నారు. జనసేన అభ్యర్థి గిడ్డి మాట్లాడుతూ మిత్రపక్షమైన టిడిపి నాయకులకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని అందరూ సమైక్యంగా సహకరించాలని కోరారు. ఈ సమావేశం మద్యలో మండల టిడిపి అధ్యక్షులు, మాజీ ఎంపీపీల మధ్య ఒకరిపై ఒకరు ఆరోపణలు తీసుకుంటూ రెండు వర్గాలుగా తయారయ్యారు. ముందు రోజు రాత్రి పుల్లేటికుర్రు సర్పంచ్‌ జల్లి బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఒక వర్గాన్ని పిలిచి అభ్యర్థి గిడ్డితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయమై సమావేశంలో రెండు వర్గాల ఆధిపత్య పోరుతో కూటమి అభ్యర్థి గెలుపుకు సహకరిస్తారా.! అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ కూటమి వర్గాలుగా ఇలాగే ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు మూడు ముక్కలు అవడం ఖాయమంటూ ఆ పార్టీ నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు వక్కలంక బుల్లియ్య, నామన రాంబాబు, డొక్కా నాథ్‌బాబు, మాజీ ఎంపిపి డివివి సత్యనారాయణ, బొంతు పెదబాబు, మండల అధ్యక్ష కార్యదర్శులు డి.శ్రీను రాజు, గుడాల ఫణి, జి.వి.రాఘవులు, చిన్నం బాలవిజయారావు, ఎన్‌. వి.సుబ్బారావు, రాష్ట్ర ఎంబీసీ సభ్యులు యడ్లపల్లి తుక్కియ్య, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️