ఇమామ్‌ ఆలీకి ఘనంగా నివాళులు

Apr 1,2024 23:09
ఇమామ్‌ ఆలీకి ఘనంగా నివాళులు

ప్రజాశక్తి-అమలాపురం, రామచంద్రపురంమొదటి ఖలీఫా, మహమ్మద్‌ ప్రవక్త అల్లుడు హజరత్‌ ఇమామ్‌ ఆలీ వర్థంతి సందర్భంగా ముస్లిం సోదరులు ఆయనకు సోమవారం ఘనంగా నివాళుర్పించరాఉ. అమలాపురం 12వ వార్డు ముజాఫర్‌ సందులోని ఆస్థానే అబ్బాసియా పీర్ల పంజాలో ప్రార్థనలు నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు సుదూర ప్రాంతాల నుంచి మహిళలు, వృద్ధులు, పిల్లలు పెద్దలు అందరూ అధిక సంఖ్యల్లో పాల్గొన్నారు, పంజాలో వర్థంతి విశిష్టతను మహమ్మద్‌ హైదర్‌ అలీ వివరించారు. ఈ ప్రార్థనల్లో మసీదు అధ్యక్షుడు నిసార్‌ హుస్సేన్‌, కార్యదర్శి కర్రార్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు. రామచంద్రపురంలోని ద్రాక్షారామంలో ముస్లిం సోదరులు ఇమామ్‌ ఆలీ పీరును అలంకరించిన గుమటం ఊరేగించారు. ద్రాక్షారామం పరిసర ప్రాంతాల నుంచి ముస్లిములు హాజరయ్యారు.

➡️