ఐలమ్మ స్ఫూర్తితో రజకులు అభివృద్ధి చెందాలి

Feb 11,2024 22:18

ఐలమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు తదితరులు

ప్రజాశక్తి-ముమ్మిడివరం

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీర నారీ చాకలి ఐలమ్మ స్ఫూర్తితో రజకులు అన్నిరంగాల్లో అభివృద్ది చెందాలని జిల్లా అన్నంపల్లి రజక సంఘం పేర్కొంది. మండలంలోని అన్నంపల్లి గ్రామంలో రజకుల సంఘం ఆధ్వ ర్యంలో ఆదివారం బల్లల పూజ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర భూ పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన వీర నారీ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సంఘ నాయకులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం మరియు వెట్టి చాకిరీ బానిసత్వాన్ని పారద్రోలాలంటే భూస్వాముల కబంధ హస్తాల్లో ఉన్న భూమి ప్రతి కుటుంబానికి భూమి దక్కాలని పోరాడిన ఐలమ్మ స్ఫూర్తితో రజకులు సంఘటితంగా పోరాటానికి సిద్ధం కావాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని రజక సంఘం సభ్యులు, మహిళలు చిన్నారులు పాల్గొన్నారు.

➡️